← Back to PublicVibe Media

State News

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ డిమాండ్‌

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ డిమాండ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు (యం), సెప్టెంబర్‌ 15 (పబ్లిక్ వైబ్) : సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆత్మకూరు మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ యాదగిరికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మనతోపాటు విమోచనం పొందిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ తరఫున పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గజరాజు కాశీనాథ్‌, మండల కార్యదర్శులు గోరిపల్లి మల్లారెడ్డి, కోరే లక్ష్మణ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొబ్బలి ఇంద్రారెడ్డి, ఉప సర్పంచ్‌ మజ్జిగ నరేష్‌, జిల్లా నాయకులు బండారు సత్యనారాయణ, కొల్లోజు శోభన్‌బాబు, మండల ఉపాధ్యక్షులు పరకాల రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు లోడి వెంకటయ్య, బీజేపీ నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.