State News
ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

ఆలేరు పబ్లిక్ వైబ్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా బీసీ కాలనీలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఘణపురం నరేందర్, నార భరత్, ఎర్ర అజయ్ కుమార్ ,మొగులగాని ప్రశాంత్,శ్యామ్,కర్రె వినయ్,అభిరామ్,ఉదయ్,అక్షయ్,మనుదీప్,వినయ్,కాలనీవాసులు పాల్గొన్నారు.