← Back to PublicVibe Media

State News

చేయూత పెన్షన్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు

చేయూత పెన్షన్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు

ఆలేరు,పబ్లిక్ వైబ్: చేయూత పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణకు నేడే ఆఖరు గడువు అని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ పరిధిలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Story image

ఇంతవరకు దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తమ దరఖాస్తు పత్రాలను అందజేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా కార్యాలయ పనివేళల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు.