← Back to PublicVibe Media

State News

రోడ్లపై నిలిచిన వర్షపు నీరు తొలగింపు

 రోడ్లపై నిలిచిన వర్షపు నీరు తొలగింపు

ఆలేరు, పబ్లిక్ వైబ్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం కురిసిన వర్షానికి ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ వెంటనే స్పందించి, నీరు నిలిచిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లపై ఉన్న నీటిని వెంటనే మురుగు కాలువల్లోకి మళ్లించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

చైర్‌పర్సన్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది డోజర్ సహాయంతో రంగంలోకి దిగి నీటిని డ్రైనేజీలోకి మళ్లించారు. బస్టాండ్ ముందు, రైల్వే గేట్ ఇరువైపులా చేరిన నీటిని తొలగించారు. . సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు, 2వ వార్డు కౌన్సిలర్ వానరాశి మరియమ్మ మార్క్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.