State News
రాయిపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 14 (పబ్లిక్ వైబ్): ఆత్మకూర్ (ఎం) మండలం రాయపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ‘భగత్ సింగ్ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం భక్తజనుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఆధ్యాత్మిక వాతావరణంలో గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి విశేష మంగళ హారతులు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే, గ్రామస్థులందరినీ ఉత్సాహపరిచేలా చిన్నారులు, మహిళలు, యువత కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గ్రామంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ప్రతి ఏటా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.