← Back to PublicVibe Media

State News

సీఎం రిలీఫ్ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

సీఎం రిలీఫ్ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 13 (పబ్లిక్ వైబ్): లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదివారం పంపిణీ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన ఈ చెక్కులను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందడి అనంత రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్ధులు, మండల పీఏసీఎస్ డైరెక్టర్ జెట్ట ధనుంజయ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జెట్ట నవీన్, సర్పంచ్ ఇంద్రాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.