← Back to PublicVibe Media

State News

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్’ (Cyclone Arnab) ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గత 6 గంటలుగా గంటకు 20 కి.మీ. వేగంతో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, తుపాను ప్రస్తుతం క్రింది ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది:

విశాఖపట్నానికి: ఆగ్నేయంగా 220 కి.మీ.

కాకినాడకు: 240 కి.మీ.

మచిలీపట్నానికి: 340 కి.మీ.

బాపట్లకు: 410 కి.మీ.

ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు: 370 కి.మీ. దూరంలొ ఉంది.

ఎప్పుడు, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందంటే?

ఈ తీవ్ర తుపాను బుధవారం ఉదయం బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా యానాం ప్రాంతం వద్ద తీరం దాటే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

భారీ ఈదురు గాలులు, వర్షాల హెచ్చరిక:

ఇది అత్యంత తీవ్ర తుపాను (Severe Cyclonic Storm) రూపం దాల్చే ప్రమాదం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కి.మీ. వేగంతో, గరిష్టంగా 150 కి.మీ. వేగంతో తీవ్రమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సహాయక చర్యల కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.