← Back to PublicVibe Media

State News

వైద్యరంగంలో నూతన మైలురాయి...'సుప్రజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్' ప్రారంభం

వైద్యరంగంలో నూతన మైలురాయి...'సుప్రజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్' ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 15 (పబ్లిక్ వైబ్) : వైద్యరంగంలో ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అత్యంత చేరువ చేసే లక్ష్యంతో మియాపూర్‌లో ఏర్పాటు చేసిన 'సుప్రజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్' అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర రాజకీయ, వైద్య వర్గాల ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య విభాగాలు, ఐసీయూ (ICU) యూనిట్లు, అత్యవసర చికిత్స విభాగాలను పరిశీలించి, మేనేజ్‌మెంట్ కల్పిస్తున్న వసతులను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో సుప్రజ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. సుమారు 200 పడకల సామర్థ్యంతో, అన్ని రకాల ప్రత్యేక వైద్య విభాగాలను ఒకే చోట అందుబాటులోకి తేవడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్యుల బృందం ఇక్కడ అందుబాటులో ఉండటం మియాపూర్, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు పెద్ద వరం అని తెలిపారు.

హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శిగ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రోగులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఈ 200 బెడ్ల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాము. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ, అత్యుత్తమ వైద్య ప్రమాణాలను పాటించడమే మా ప్రధాన ధ్యేయం" అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, రాజకీయ ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.